: ఆయనదే కాదు, ఆయన తండ్రిది కూడా వీరమరణమే!


పంజాబ్ లోని గుర్ దాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్ లో మాటువేసిన ఉగ్రవాదుల పీచమణిచేందుకు వెళ్లి వీరమరణం పొందిన పంజాబ్ ఇంటెలిజెన్స్ ఎస్పీ బల్జీత్ సింగ్ తండ్రిది కూడా వీరమరణమే. 13 మంది వీరమరణంపై దేశం యావత్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న ఈ ఘటనలో అందరినీ కదిలించే అంశం ఎస్పీ బల్జీత్ సింగ్ మరణం అనడంలో సందేహం లేదు. సాధారణంగా తీవ్రవాద దాడుల సమయంలో వారిని మట్టుబెట్టే ప్రణాళికలు రచించి, అవి అమలయ్యేలా చూస్తూ దాడులను నడిపిస్తారు అధికారులు. అందుకు భిన్నంగా ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపేలా ఆయనే కదనరంగంలోకి దూకారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు దూసుకెళ్తూ బుల్లెట్లకు బలయ్యారు. కాగా, ఎస్పీ బల్జీత్ సింగ్ తండ్రి కూడా ఆయనలాగే ఉగ్రతూటాలకు బలై, వీరమరణం పొందడం కాకతాళీయం. పంజాబ్ లో ఉగ్రవాదం తీవ్రంగా ఉన్న 1984లో బల్జీత్ సింగ్ తండ్రి అచ్చార్ సింగ్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తూ ఉగ్రవాదుల చేతిలో వీరమరణం పొందారు.

  • Loading...

More Telugu News