: ‘రియల్’ దాడిపై రెవెన్యూ నిరసన... మద్దతు పలికిన ఎపీఎన్జీఓ
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో ప్రభుత్వ భూముల కబ్జాను అడ్డుకున్న రెవెన్యూ ఉద్యోగులపై దాడి ఘటన ఏపీలో కలకలం రేపుతోంది. పట్టపగలు జనం చూస్తుండగానే ప్రభుత్వ సిబ్బందిపై దాడి చేసిన రియల్ మాఫియాకు నిరసనగా వీఆర్వోల అసోసియేషన్ ఆందోళనకు దిగింది. మంగళగిరి తహశీల్దార్ కార్యాలయం ముందు వీఆర్వో అసోసియేషన్ సభ్యులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇదిలా ఉంటే, ఉద్యోగులపై దాడులను నిరసించాల్సిందేనని ప్రకటించిన ఏపీఎన్జీఓల సంఘం కూడా వీఆర్వోల నిరసనకు మద్దతు పలికింది.