: అరాచక విద్యార్థులను ఎక్కడా చదువుకోనివ్వం... ఏపీ మంత్రి గంటా ఘాటు వ్యాఖ్య
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీఆర్క్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య ఉదంతం వర్సిటీలో పలు కీలక మార్పులకు తెరలేపింది. తిరుపతిలో కొద్దిసేపటి క్రితం వర్సిటీ వీసీల సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి వచ్చిన ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వర్సిటీల్లో అరాచకాలు సృష్టించే విద్యార్థులను ఎక్కడా చదువుకోని విధంగా నిషేధాన్ని విధిస్తామన్నారు. కులాల పేరిట విద్యార్థులను వేధించే వారిపైనా ఉక్కుపాదం మోపుతామని ఆయన ప్రకటించారు. అంతేకాక ఇకపై ప్రతి వర్సిటీలోనూ పోలీస్ ఔట్ పోస్టును ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.