: హైకోర్టు విభజన జరిగితేనే మేలు: కేంద్ర సమాచార హక్కు కమిషనర్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండుగా విడిపోతేనే మేలని కేంద్ర సమాచార హక్కు కమిషనర్ మాడభూషి శ్రీధర్ అభిప్రాయపడ్డారు. హైకోర్టు విభజన జరిగితేనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని, తెలంగాణ సార్వభౌమత్వాన్ని వారు అనుభవించగలుగుతారని అన్నారు. హైకోర్టు విభజన కాకపోవడంతో ఇరు రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వరంగల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, హైదరాబాదును యూటీ కాకుండా అడ్డుకోవడం ద్వారా తెలంగాణ ప్రజలు విజయం సాధించారని చెప్పారు.