: సానియా భర్తకు దీటుగా బదులిచ్చిన యువీ
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఆమె భర్త షోయబ్ మాలిక్ ఇటీవలే డబ్ స్మాష్ వీడియోలో చిందులేయడం తెలిసిందే. దీనిపై భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందిస్తూ, "అదేమి డ్యాన్సు... భయంకరంగా ఉంది!" అని ట్వీట్ చేయగా... "మైదానంలోకి రా యువీ, చూసుకుందాం!" అంటూ షోయబ్ సవాల్ విసిరాడు. ఇప్పుడు యువీ వంతు వచ్చింది. జిమ్ లో మైకేల్ జాక్సన్ గీతం 'యు రాక్ మై వరల్డ్' గీతానికి సింపుల్ గా స్టెప్పేసిన యువీ ఆ వీడియోను ఫేస్ బుక్ లో పెట్టాడు. "ఇదిగో ఇలా చేయాలి డ్యాన్సు! షోయబ్ మాలిక్ భాయ్... నేను మైదానంలోనే ఉన్నా!" అంటూ దీటుగా బదులిచ్చాడు. మరి దీనిపై పాక్ క్రికెటర్ షోయబ్ ఎలా స్పందిస్తాడో చూడాలి!