: సల్మాన్ ఖాన్ పై తండ్రి మండిపాటు


ముంబయి పేలుళ్ల కేసులో ఉరిశిక్షకు సిద్ధమవుతున్న యాకూబ్ మెమన్ పై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ జాలి చూపడం తెలిసిందే. అన్న టైగర్ మెమన్ చేసిన తప్పుకు తమ్ముడు యాకూబ్ బలవుతున్నాడన్న కోణంలో సల్మాన్ ట్వీట్ చేశాడు. సల్మాన్ ఈ విధంగా ట్విట్టర్లో పేర్కొనడంపై ఆయన తండ్రి సలీం ఖాన్ మండిపడ్డారు. సల్మాన్ ట్వీట్లు అర్థరహితమని అన్నారు. ఆ ట్వీట్లు హాస్యాస్పదంగా ఉన్నాయని, సల్మాన్ అభిప్రాయాలతో తాను ఏకీభవించబోనని స్పష్టం చేశారు. ఆ ట్వీట్లను సీరియస్ గా పరిగణించరాదని ప్రజలకు సూచించారు. కాగా, యాకూబ్ ను ఉరితీయకుండా, జైల్లోనే ఉంచాలని, అదే అతనికి పెద్ద శిక్ష అని సలీం ఖాన్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News