: కత్రినా వంటి ప్రియురాలు, భార్య దొరికితే అదృష్టమే!: సైఫ్ అలీ ఖాన్
కత్రినా కైఫ్ ను పొగడ్తలతో ముంచేస్తున్నాడు సైఫ్ అలీ ఖాన్. కత్రినా వంటి ప్రేయసి, భార్య ఎవరికి జీవితంలోకి వచ్చినా వారు అదృష్టవంతులేనని అంటున్నాడు. వీరిద్దరూ నటించిన తాజా చిత్రం 'ఫాంటమ్' ప్రమోషనల్ ఈవెంటులో పాలుపంచుకున్న వీరు మీడియాతో మాట్లాడారు. తాను నటించిన హీరోయిన్లలో కత్రినా బెస్ట్ అని, బాలీవుడ్ లోని నటీమణుల్లో అందమైన గొప్పనటి అని అన్నాడు. కత్రినా ఎంతో కష్టపడే స్వభావమున్న నటిగా అభివర్ణించిన ఆయన, ఆమెతో గడపడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తుందని అన్నాడు. కాగా, ఫాంటమ్ చిత్రం ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.