: బంగారం గురించి మీరు తెలుసుకోవలసిన పచ్చి నిజాలు!


భారతీయులకు, బంగారానికి ఎంతో అనుబంధం ఉంది. ధర పెరిగినా, తగ్గినా బంగారానికి ఉన్న విలువ ఎన్నడూ మారదు. పది గ్రాముల ధర రూ. 33 వేలకు పెరిగినా, రూ. 23 వేలకు పడిపోయినా పసిడి కొనుగోళ్లు ఆగవు. ఈ నేపథ్యంలో బంగారం గురించిన కొన్ని పచ్చి నిజాలివి... * ఇండియాలో ప్రజల వద్ద, వివిధ దేవాలయాల వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా? అక్షరాలా 2.2 కోట్ల కిలోలు. ప్రభుత్వ ఖజానాలో ఉన్న బంగారం దీనికి అదనం. * బంగారం విలువ తెలిసిన తరువాత ఇప్పటివరకూ 17.50 కోట్ల కిలోల బంగారాన్ని గనుల నుంచి వెలికి తీసినట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా. * ఔన్సు బంగారాన్ని (సుమారు 28.3 గ్రాములు) 10.7 చదరపు గజాల పల్చటి రేకులా సాగదీయవచ్చు. * బంగారాన్ని ఎంత పల్చగా చేయవచ్చంటే, టార్చిలైటు కాంతి అవతలివైపుకు వచ్చేంత! * ప్రపంచంలోని బంగారాన్ని 5 మైక్రాన్ల మందంగల తీగగా మార్చి భూమి చుట్టూ తిప్పితే, కోటీ పన్నెండు లక్షల చుట్లు తిరగాల్సి వుంటుంది. * 1973లో 12 వేల టన్నుల బంగారం నిల్వలు దాచుకున్న అమెరికా వద్ద ఇప్పుడు 6,700 టన్నులు మాత్రమే ఉంది. ఇందులో 5.3 లక్షల కిలోల బంగారం ఇటుకల రూపంలో ఉంది. * 10 వేల స్మార్ట్ ఫోన్ల నుంచి బంగారాన్ని తీస్తే 311 గ్రాములు లభిస్తుంది. 200 ల్యాప్ టాప్ లను ప్రాసెస్ చేస్తే 155 గ్రాముల బంగారం తీయవచ్చు. * ప్రపంచంలో 100 కిలోల బంగారు నాణెం కెనడాలో ఉండగా, ఆస్ట్రేలియాలో టన్ను బరువున్న నాణెం ఉంది. * బంగారాన్ని కరిగించాలంటే 1,064 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి. * చంద్రుడిపైకి అమెరికా పంపిన కొలంబియా స్పేస్ షటిల్ లో 40 కిలోల బంగారాన్ని వాడారు. * బంగారాన్ని చూసి మీరు భయపడతారా? అయితే మీకు ‘ఆరోఫోబియా’ ఉన్నట్టే!

  • Loading...

More Telugu News