: రాజమండ్రి పేరును మారుస్తున్నట్టు ప్రకటించిన చంద్రబాబు
రాజమండ్రి పేరును 'రాజమహేంద్రవరం'గా మారుస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. గతంలో ఈ పేరే ఉందని గుర్తు చేసిన ఆయన, బ్రిటిష్ వారు తాము పిలుచుకోవడానికి వీలుగా రాజమండ్రిగా మార్చారని, దాన్ని మళ్లీ మార్చాలని నిర్ణయించినట్లు చెప్పారు. గోదావరి ఆది పుష్కరాల ముగింపు సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ నగరాన్ని రాష్ట్రానికి సాంస్కృతిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని వివరించారు. ధవళేశ్వరం బ్యారేజీ చుట్టూ 35 కిలోమీటర్ల ప్రాంతాన్ని అఖండ గోదావరి ప్రాజెక్టుతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. అందుకోసం రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. రాజమండ్రిలోని అన్ని చారిత్రక ఆనవాళ్లను భవిష్యత్ తరాలకోసం కాపాడతామని చంద్రబాబు వివరించారు.