: బోయపాటి డైరెక్షన్ లో బాణాసంచా...వెలుగుల మయమైన రాజమండ్రి పాత వంతెన
ఎంతో చరిత్ర, విశిష్టత కలిగివున్న రాజమండ్రి పాత వంతెన ఈ సాయంకాలం వెలుగుల మయం అయింది. పుష్కరాల ముగింపు వేడుకల సందర్భంగా అఖండ హారతి ముగిసిన తరువాత, గోదావరి పాత వంతెన బాణసంచా వెలుగుజిలుగులు సంతరించుకుంది. లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన బాణ సంచా కాల్పులు దీపావళిని తలపించాయి. కొత్త సంవత్సర వేడుకలు విదేశాల్లో నిర్వహించినంత ఘనంగా ఏపీ ప్రభుత్వం బాణాసంచా ఏర్పాట్లు చేయడం విశేషం. వివిధ రంగులు విరజిమ్ముతూ ఆకాశాన్ని కాంతిమంతం చేసిన బాణాసంచా వీక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. రాజమండ్రి పట్టణంపై ఆకాశం వర్ణరంజితం అయింది. ఇంధ్రధనుస్సు వెలిసిందా? అన్నట్టు బాణసంచా మిరుమిట్లు గొలిపేలా పేల్చారు. దీంతో అంతా హర్షం వ్యక్తం చేశారు. ఈ బాణాసంచా వెలుగులను బోయపాటి డైరెక్షన్ లో నిర్వహించిన సంగతి తెలిసిందే.