: గోదావరి తీరాన కొలువుదీరిన ఏపీ కేబినెట్


రాజమండ్రిలో గోదావరి పుష్కరాల ముగింపు వేడుకలకు పలువురు ఆంధ్రప్రదేశ్ మంత్రులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీ సమేతంగా హాజరు కాగా, డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రులు యనమల, దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, మృణాళిని తదితరులు కూడా విచ్చేసి ప్రత్యక్షంగా తిలకించారు. ముఖ్యఅతిథి బాబా రాందేవ్ హారతిలో పాలుపంచుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో గోదావరి నదీమతల్లి పులకించిపోయింది. తెలంగాణలో మంత్రి ఈటల, ఇతర మంత్రులు అఖండ హారతిలో పాలుపంచుకున్నారు. లక్షలాది మంది ప్రజల సాక్షిగా గోదావరి అఖండ హారతి ఉత్సవం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆద్యంతం వైభవంగా జరిగింది.

  • Loading...

More Telugu News