: డ్రంకన్ డ్రైవ్ ప్రాణ సంకటమే... మందుబాబులకు మంచు లక్ష్మి కౌన్సెలింగ్!


మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే ప్రాణాలకే ప్రమాదమంటూ సినీ నటి మంచు లక్ష్మి ప్రసన్న మందుబాబులకు సూచించారు. వీకెండ్ లలో డ్రంకన్ డ్రైవ్ పై సమరశంఖం పూరించిన హైదరాబాదు పోలీసుల తరఫున ప్రచారం నిర్వహించేందుకు మంచు లక్ష్మి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత రాత్రి ఆమె రంగంలోకి దిగారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీలకు ఆమె హాజరయ్యారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రాణ సంకటమంటూ ఆమె వాహనదారులకు అవగాహన కల్పించారు.

  • Loading...

More Telugu News