: ఉరిశిక్షపై ఒవైసీ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు: షానవాజ్ హుస్సేన్
ముంబై పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్ ఉరిశిక్షను అనవసరంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రాజకీయం చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ మండిపడ్డారు. ముంబై పేలుళ్లలో హిందువులు, ముస్లింలు ఇద్దరూ మరణించారని... ఇరు మతస్తులనూ చంపేశారని అన్నారు. ఈ దారుణాన్ని మతతత్వ కోణంలో చూడరాదని సూచించారు. తీర్పులను వెలువరించే ముందు దోషుల మతాలను కోర్టులు చూడవని అన్నారు. మెమన్ ముస్లిం కావడం వల్లే అతన్ని ఉరి తీస్తున్నారంటూ మజ్లిస్ అధినేత వ్యాఖ్యానించడం తెలిసిందే. ఈ క్రమంలో, ఒవైసీ వ్యాఖ్యలను ఇప్పటికే పలువురు నేతలు ఖండించారు.