: ఆయన రాహుల్ కాదు రాహువు... పయ్యావుల ఘాటు వ్యాఖ్యలు


అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలించిన 10 ఏళ్ల కాలంలో 24 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని... అలాంటి కాంగ్రెస్ నేతలు రైతు యాత్రలు చేపడతారా? అంటూ నిలదీశారు. కేక్ కట్ చేసినంత ఈజీగా రాష్ట్రాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీనే అని... విభజన చేసేటప్పుడు ప్రత్యేక హోదాను బిల్లులో పెట్టకుండా మోసం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసి ఏపీ ప్రజల హృదయాలను గాయపరిచిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని రాష్ట్రంలో పర్యటిస్తారని అన్నారు. అనంతపురంలో పర్యటించింది రాహుల్ కాదని... రాహువు అని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన రాహుల్ లాంటి వారిని తెగనరికినా పాపం లేదని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News