: లవ్ అఫైర్ల కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న కేంద్ర మంత్రి


దేశంలో కొంత కాలంగా వ్యవసాయం రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టపోవడం, చేతికందిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడం వంటి కారణాలు రైతులను కుంగదీస్తున్నాయి. లాభాలు రాకపోగా, అప్పులు ఎక్కువై రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనిపై, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ ఎంత గొప్పగా ప్రవచించారో చూడండి! రైతులు బలవన్మరణాలకు పాల్పడుతోంది ఆర్థిక కారణాలతోనే కాదట... ప్రేమ వ్యవహారాలు, వ్యసనాలు కూడా వారిని ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయని విశ్లేషించారు. మాదకద్రవ్యాల సేవనం, వరకట్న అంశాలు, పిల్లలు పుట్టకపోవడం ఇలా ఎన్నో కారణాలున్నాయని సూత్రీకరించారు. రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అయితే, అప్పులు కూడా ఓ కారణమేనని ముక్తాయించారు.

  • Loading...

More Telugu News