: ‘వ్యాపం’ బాధ్యతలు ఎప్పుడు చేపడతారు?... సీబీఐకి సుప్రీం ప్రశ్న


మధ్యప్రదేశ్ లో పురుడు పోసుకున్న ‘వ్యాపం’ కుంభకోణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీంతో ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు సీబీఐకి ఆదేశాలు జారీ చేసి చాలా రోజులే అవుతోంది. అయితే సీబీఐ నేటికీ ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను పూర్తి స్థాయిలో స్వీకరించలేదు. కోర్టులో ఈ కేసును వాదించేందుకు కనీసం న్యాయవాదులను నియమించుకోలేదట. ఇవే అంశాలను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం సీబీఐకి మొట్టికాయలేసింది. అసలు కేసు దర్యాప్తు బాధ్యతలను ఎప్పుడు స్వీకరిస్తారో చెప్పాలని కోర్టు సీబీఐని సూటిగా అడిగింది.

  • Loading...

More Telugu News