: మూడు రోజుల నుంచి అదే తీరు... సోమవారానికి వాయిదాపడ్డ లోక్ సభ
మూడు రోజుల నుంచి ఎలాంటి సమావేశాలు, చర్చ జరగకుండా నిరసనలు, ఆందోళనలతో లోక్ సభ వాయిదాపడుతోంది. బీజేపీ మంత్రుల రాజీనామా డిమాండు, లలిత్ మోదీ వివాదం, వ్యాపం కుంభకోణం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు తీవ్రంగా పట్టుబడుతున్నాయి. దాంతో సభా సమావేశాలు కాస్త కూడా ముందుకు సాగకపోవడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ కు వాయిదాలే దిక్కయ్యాయి. విపక్షాల తీరుతో నిన్న ఏకంగా తలపట్టుకున్న స్పీకర్ ఏం చేయాలో తెలియక నిస్సహాయంగా ఉండిపోయారు. ఈరోజు కూడా లోక్ సభలో అదే తంతు కొనసాగడంతో ఏకంగా సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.