: రాజకీయాల్లోకి త్రిష!... అన్నా డీఎంకేలో చేరుతుందని జోరందుకున్న ప్రచారం


దక్షిణాది చలనచిత్ర రంగంలో అగ్ర నటిగా కొనసాగుతున్న త్రిష కృష్ణన్ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనుందట. తమిళనాడు సీఎం జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకేలో ఆమె చేరనుందన్న ప్రచారం తమిళ చలనచిత్ర రంగంలో జోరందుకుంది. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగానే ఉన్న త్రిష, వ్యక్తిగత జీవితంలో పలు ఆటుపోట్లను ఎదుర్కొంది. అయినా ఏమాత్రం చలించని ఆమె వరుస చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. సినీ రంగంలో పేరు ప్రఖ్యాతులు సాధించిన కుష్బూ, విజయశాంతి, జయసుధ, జయప్రద, రోజా తదితరులు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. వీరి బాటలోనే త్రిష కూడా రాజకీయాల్లో చేరనున్నారన్న ప్రచారం ఊపందుకుంది. జయలలితను అభిమానించే త్రిష, ఆమె నేతృత్వంలోని అన్నా డీఎంకేలోనే చేరనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈలోగానే త్రిష రాజకీయ అరంగేట్రం చేయనుందన్న ప్రచారం సాగుతోంది.

  • Loading...

More Telugu News