: ఇండో-లంక సిరీస్ లో హోరాహోరీ తప్పదు: సెహ్వాగ్
భారత్-శ్రీలంక సిరీస్ లో హోరాహోరీ పోరు తప్పదని వెటరన్ బ్యాట్స్ మన్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. అయితే, ఈ పోరాటంలో టీమిండియాదే పైచేయిగా నిలుస్తుందని భావిస్తున్నట్టు తెలిపాడు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు లక్నో వచ్చిన వీరూ మీడియాతో ముచ్చటించాడు. జట్టులో యువ ప్రతిభావంతులు ఉండడంతో సిరీస్ ఆసక్తికరంగా సాగుతుందని అన్నాడు. కోహ్లీ సేన సామర్థ్యంపై తనకు నమ్మకం ఉందన్నాడు. కాగా, ఇక్కడి రామ్ మనోహర్ లోహియా పార్క్ వద్ద సెహ్వాగ్ ను చూసిన అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. అంతర్జాతీయ క్రికెట్లోకి ఈ ఢిల్లీ క్రికెటర్ పునరాగమనాన్ని ఆకాంక్షిస్తూ'సెహ్వాగ్ కమ్ బ్యాక్' అంటూ నినాదాలు చేశారు.