: కేసీఆర్ మళ్లీ పోటీకి దిగితే ఓడిస్తా: టీడీపీ నేత వంటేరు సవాల్
సీఎం కేసీఆర్ మళ్లీ గజ్వేల్ లో ఎన్నికల పోటీకి దిగితే ఓడిస్తానంటున్నారు టీడీపీ నేత వంటేరు ప్రతాపరెడ్డి. లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. తనను గెలిపించిన నియోజకవర్గానికి కేసీఆర్ ఇంతవరకు చేసిందేమి లేదని ఆయన ఆరోపించారు. 2014 గజ్వేల్ నియోజకవర్గ ఎన్నికల్లో 19,391 ఓట్ల తేడాతో కేసీఆర్ చేతిలో వంటేరు పరాజయం పాలయ్యారు.