: మిశ్రా ఎంపిక ఆశ్చర్యం కలిగిస్తోంది: అగార్కర్


శ్రీలంక టూర్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాకు చోటు కల్పించడం పట్ల మాజీ పేసర్ అజిత్ అగార్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మిశ్రాను జట్టులోకి తీసుకోవడం దేశంలో యువ స్పిన్నర్ల కొరతను ఎత్తిచూపుతోందని అన్నాడు. లంకలో స్పిన్ పిచ్ లు ఎదురవుతాయన్న కారణంతో జాతీయ సెలక్టర్లు జట్టులో మూడో స్పిన్నర్ కు చోటు కల్పించారు. హర్భజన్ సింగ్, అశ్విన్ లు తమ స్థానాలు నిలుపుకున్నారు. జట్టు ఎంపికపై అగార్కర్ స్పందిస్తూ... "హర్భజన్ లా ఎంతోకాలంగా ఆడుతున్న మిశ్రావైపే మొగ్గు చూపారు సెలక్టర్లు. వీళ్లు కాకుండా ప్రతిభావంతుడైన కొత్త స్పిన్నర్ అంటూ ఎవరూ లేకపోవడం కలవరపరుస్తోంది. ఇది చాలా బాధాకరమైన విషయం. మిశ్రా ఎప్పటినుంచో ఆడుతున్నాడు. బౌలింగ్ కొంచెం స్లోగా ఉండడంతో టెస్టు క్రికెట్ లో ప్రభావం చూపలేకపోయాడు. యువ లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ గాయపడడం అనుభవజ్ఞుడిని తీసుకునేందుకు సెలక్టర్లను పురిగొల్పి ఉంటుంది. మిశ్రా ఎంపిక కంటే కూడా, దేశంలో వందలమంది క్రికెటర్లు ఉండగా, వారిలో పనికొచ్చే ఒక్క కొత్త స్పిన్నర్ లేకపోవడమే అత్యంత బాధాకరం" అని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News