: అసెంబ్లీ బిల్డింగ్ ను చంద్రబాబు తాత కట్టించాడా?: శ్రీనివాస్ గౌడ్ తీవ్ర విమర్శలు


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుపుకుంటున్న భవంతిని చంద్రబాబునాయుడు తాత కట్టించాడా? అని తెలంగాణ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. పదేపదే తెలంగాణపై విమర్శలు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. హైదరాబాదులోని చారిత్రక కట్టాడాలన్నీ నిజాం కాలంలోనే కట్టించారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఆంధ్రా ప్రాంతానికి కరెంటు రాకముందే తెలంగాణ వెలుగులతో నిండిపోయిందని గుర్తు చేశారు. ఒకప్పుడు తాగునీటి తటాకంగా ఉన్న హుస్సేన్ సాగర్ ను మురుగునీటి కుంటగా మార్చింది ఆంధ్రా పాలకులేనని శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News