: వైయస్ విగ్రహానికి పుష్కర స్నానం చేయించారు!


గోదావరి పుష్కరాల సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది ప్రజలు పవిత్ర పుష్కర స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో, కొంతమంది వైకాపా కార్యకర్తలు దివంగత వైయస్.రాజశేఖర రెడ్డిపై తమకున్న ప్రేమను, అభిమానాన్ని చాటుకున్నారు. వైయస్ విగ్రహానికి పుష్కర స్నానం చేయించారు. ఈ ఘటన, పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలో చోటుచేసుకుంది. అనంతరం వీరు వైయస్ కు పిండ ప్రదానం కూడా చేశారు. ఆ తర్వాత వీరు మాట్లాడుతూ, వైయస్ విగ్రహానికి పుష్కర స్నానం చేయించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. తరతరాలు గుర్తుంచుకోదగ్గ నేత వైయస్ అంటూ కొనియాడారు.

  • Loading...

More Telugu News