: టీవీల్లో కనిపించేందుకు రాహుల్ ఆరాటపడుతున్నాడు... కేంద్ర మంత్రి జవదేకర్ కామెంట్
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ సర్కారుపై వాగ్బాణాలు సంధించిన మరుక్షణమే బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు ఆయనపై ఎదురు దాడి ప్రారంభించారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీవీల్లో కనిపించేందుకే రాహుల్ గాంధీ తమపై ఆరోపణలు గుప్పిస్తున్నారని జవదేకర్ మండిపడ్డారు. రాహుల్ సహా కాంగ్రెస్ పార్టీ నేతలు నల్లబ్యాడ్జీలు ధరించడం, ఆందోళనలు చేయడం కేవలం టీవీల్లో కనిపించేందుకేనని ఆయన వ్యాఖ్యానించారు. గడచిన పదేళ్లుగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ దోపిడీ పాలనపై రాహుల్ గాంధీ సమాధానం చెబితే, ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్పుతారని ఆయన పేర్కొన్నారు.