: టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ ఇంటిపై దుండగుల దాడి


మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ నాగేందర్ ఇంటిపై కొందరు అనుమానాస్పద వ్యక్తులు దాడి చేశారు. ఈ సమయంలో ఆయన ఇంటికి, బైక్ కు నిప్పుపెట్టి పారిపోయారు. ఈ ఘటనలో బైక్ దగ్ధమవగా, ఇంటి మంటలను ఆర్పివేశారు. ఇసుక మాఫియానే తనపై ఈ దాడి చేసిందని నాగేందర్ ఆరోపిస్తున్నారు. ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. వెంటనే దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News