: తెలంగాణ ఖజానా ఖాళీ!...నెలరోజులుగా నిలిచిన చెల్లింపులు
రాష్ట్ర విభజన తర్వాత మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. అయితే ఏడాది తిరిగేలోగానే ఆ రాష్ట్ర బడ్జెట్ లోటు బడ్జెట్ గా మారిపోయింది. ఆదాయ, వ్యయాల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. వెరసి నెలరోజులుగా రాష్ట్ర ఖజానా నుంచి చిల్లిగవ్వ కూడా విడుదల కావడం లేదు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయతో పాటు మధ్యాహ్న భోజన పథకానికి కూడా నిధుల విడుదల నిలిచిపోయింది. విద్యార్థుల ఫీజు బకాయిల చెల్లింపులను నిలిపేసిన ప్రభుత్వం, పంచాయతీల విద్యుత్ బిల్లులకూ నయాపైసా విడుదల చేయడం లేదు. ఒకేసారి బిల్లులన్నీ నిలిచిపోయిన విషయం బయటకు పొక్కడంతో ప్రభుత్వం ఆత్మ రక్షణలో పడిపోయింది. మీడియాలో వస్తున్న కథనాలు అభూత కల్పనలంటూ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు.