: ఏ నెట్ వర్క్ తో ఎక్కువ కాల్ డ్రాప్ సమస్య?
ఫోన్ లో అతిముఖ్యమైన విషయం మాట్లాడుతుంటాం. ఇంతలో సడెన్ గా కాల్ కట్ అయిపోయింది. కొన్ని సార్లు మధ్యలో నెట్ వర్క్ ఆగిపోతుంది. ఇలాంటి కాల్ డ్రాప్ సమస్య ఎక్కువగా ఏ నెట్ వర్క్ లో వస్తుంటుంది? అన్ని నెట్ వర్క్ లు అలాగే ఉన్నాయని అంటారా? దాని సంగతేమో కానీ, కాల్ డ్రాప్ సమస్యపై ఎక్కువ ఫిర్యాదులు ఎయిర్ టెల్ నెట్ వర్క్ పై అందాయని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తెలిపింది. ఎయిర్ టెల్ తరువాత కాల్ డ్రాప్స్ పై ఫిర్యాదులు వొడాఫోన్, ఐడియా, బీఎస్ఎన్ఎల్ పై వచ్చాయని ట్రాయ్ వెల్లడించింది. 2015 జూన్ 30 వరకు కాల్ డ్రాప్స్ సమస్య విషయంలో ఎయిర్ టెల్ పై 31, వొడాఫోన్ పై 17, ఐడియా, బీఎస్ఎన్ఎల్ పై 10 చొప్పున ఫిర్యాదులు అందాయని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్ సభకు లిఖితపూర్వక జవాబు ఇచ్చారు.