: తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉందన్న వార్తలు అవాస్తవం: ఈటెల


తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని, ఎలాంటి ఢోకా లేదని టీఎస్ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితి ఇబ్బందుల్లో ఉందని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. దేశంలో ఆర్థిక స్థితి బలంగా ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్ తొలి స్థానంలో ఉండగా, తెలంగాణ రెండో స్థానంలో ఉందని తెలిపారు. తెలంగాణ ఆర్థిక స్థితి బాగుందని రిజర్వ్ బ్యాంక్ కూడా కితాబిచ్చిందని అన్నారు. అయితే, ఐటీ శాఖ ఒకేసారి రూ. 1250 కోట్లను జమ చేసుకోవడంతో కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవమేనని... ఆ నగదును వెనక్కి రప్పించేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News