: పటేల్ ను ఎంచుకుంటారా? లేక, మిశ్రా వైపే మొగ్గు చూపుతారా?
శ్రీలంక పర్యటన కోసం భారత జట్టును గురువారం ఎంపిక చేయనున్నారు. చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ అధ్యక్షతన సెలక్షన్ కమిటీ ఢిల్లీలో సమావేశం కానుంది. లంకలో పిచ్ లు స్పిన్ కు అనుకూలిస్తాయన్న నేపథ్యంలో, జట్టులో మూడో స్పిన్నర్ కు చోటు కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది. రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్ కు తోడు ఎవరిని తీసుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. జాతీయ సెలక్టర్లు కుర్ర స్పిన్నర్ అక్షర్ పటేల్ ను ఎంచుకుంటారా? లేక, సీనియర్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా వైపు మొగ్గుచూపుతారా? అన్నది క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యువ స్పిన్నర్ కర్ణ్ శర్మ జింబాబ్వే టూర్లో గాయపడడంతో అమిత్ మిశ్రా పేరు తెరపైకి వచ్చింది.