: ఫాస్ట్ ఫుడ్ త్యాగం చేసిన 'ఫాస్టెస్ట్' మ్యాన్!


జమైకా చిరుత, వరల్డ్ ఫాస్టెస్ట్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ కెరీర్ పొడిగించుకునేందుకు త్యాగాలు చేస్తున్నాడు. శరీరాన్ని మంచి కండిషన్ లో ఉంచుకునేందుకు ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలని బోల్ట్ నిర్ణయించుకున్నాడు. ముఖ్యంగా, తనకెంతో ఇష్టమైన చికెన్ నగ్గెట్స్ జోలికి వెళ్లడంలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. గత సీజన్ లో గాయపడినప్పుడు, వయసు మీరుతోందన్న విషయం తెలిసివచ్చిందని పేర్కొన్నాడీ ఒలింపిక్ చాంపియన్. దాంతో, ఇకపై జాగ్రత్తగా ఉండాలని, ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకోవాలని నిశ్చయించుకున్నానని తెలిపాడు. ప్రస్తుతం బోల్ట్ లండన్ లో జరిగే డైమండ్ లీగ్ కు సన్నద్ధమవుతున్నాడు. 100 మీటర్ల పరుగు పందెంలో ప్రపంచ రికార్డు (9.58 సెకన్లు), ఒలింపిక్ రికార్డు (9.63 సెకన్లు) బోల్ట్ ఖాతాలోనే ఉన్నాయి.

  • Loading...

More Telugu News