: సెన్సెక్స్ 'బుల్' హైజంప్!


ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కీలకమైన జీఎస్టీతో పాటు వివిధ సంస్కరణల బిల్లులు ఆమోదం పొంది అమల్లోకి వస్తాయన్న అంచనాలతో వివిధ రంగాల్లోని కంపెనీల ఈక్విటీలను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ముందుకు రాగా, సెన్సెక్స్ బుల్ హైజంప్ చేసింది. బుధవారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచి సెన్సెక్స్ 322.79 పాయింట్లు పెరిగి 1.15 శాతం లాభంతో 28,504.93 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచి నిఫ్టీ 104.05 పాయింట్లు పెరిగి 1.22 శాతం లాభంతో 8,633.50 పాయింట్ల వద్దకు చేరాయి. నిఫ్టీ-50లో 41 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. సెషన్ ఆరంభంలో నష్టాల్లో ఉన్న సూచీలు ఆపై క్రమంగా లాభాల్లోకి వచ్చాయి. జడ్ఈఈఎల్, రిలయన్స్, సన్ ఫార్మా, ఎంఅండ్ఎం, బజాజ్ ఆటో తదితర కంపెనీలు 3 నుంచి 5 శాతానికి పైగా లాభపడగా, లూపిన్, ఐడియా, భారతీ ఎయిర్ టెల్, టీసీఎస్, ఇన్ఫోసిస్ తదితర కంపెనీలు 1.14 నుంచి 3.4 శాతం మేరకు నష్టపోయాయి. బీఎస్ఈలో మిడ్ కాప్ 1.30 శాతం, స్మాల్ కాప్ 0.86 శాతం లాభపడ్డాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,05,06,477 కోట్లుగా నమోదైంది.

  • Loading...

More Telugu News