: కలాం ఫొటోకు దండేసి దండం పెట్టిన మంత్రి!


భారత మాజీ రాష్ట్రపతి, జాతి గర్వించదగ్గ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం ఆరోగ్య స్థితిపై ఇటీవల కాలంలో వార్తలు కూడా ఏమీ రాలేదు! దానర్థం... ఆయన నిక్షేపంగా ఉన్నారనే కదా! ఆ విషయం కాసేపు పక్కనబెడితే... హిందూ సంప్రదాయం ప్రకారం ఓ వ్యక్తి ఫొటోకు పూలదండ వేసి, దండం పెడితే అది అంజలి అవుతుంది. జార్ఖండ్ విద్యా శాఖ మంత్రి నీరా యాదవ్ కూడా ఆ పనే చేశారు. అయితే, ఆమె దండ వేసింది అబ్దుల్ కలాం మహాశయుడి ఫొటోకే. దండ వేసి, కుంకుమ బొట్టు పెట్టి నమస్కరించారు. కోడర్మా ప్రాంతంలోని ఓ పాఠశాలలో స్మార్ట్ తరగతుల ప్రారంభోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగానే మంత్రి తన చర్యతో అందరినీ విస్మయపరిచారు. ఆ సమయంలో అక్కడ బీజేపీ ఎమ్మెల్యే మనీశ్ జైస్వాల్, పాఠశాల ప్రిన్సిపాల్ తదితర ప్రముఖులు కూడా ఉన్నారు. అంతమంది ఉండి కూడా, తాము అంజలి ఘటిస్తున్నది బతికున్న వ్యక్తికని గుర్తించలేకపోయారు. ఈ చర్య వివాదాస్పదం కావడంతో మంత్రి నీరా యాదవ్ వివరణ ఇచ్చారు. చాలా పాఠశాలల్లో మహనీయుల చిత్రాలకు దండలు వేస్తారని, అది గౌరవంతోనే అని, తాను కూడా అలాగే గౌరవ భావంతో దండ వేశానని వివరణ ఇచ్చారు. కలాం గొప్ప శాస్త్రవేత్త అని, ఆయన ఫొటోకు దండ వేయడం తప్పేమీ కాదని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News