: ఓ కాంగ్రెస్ నేత ఒత్తిడి చేశారు... ఆ బండారం పార్లమెంటులో బట్టబయలు చేస్తా: సుష్మా స్వరాజ్
బొగ్గు స్కాంలో నిందితుడిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి సంతోష్ బర్గోడియాకు డిప్లమాటిక్ పాస్ పోర్టును ఇప్పించాలని ఓ ప్రముఖ కాంగ్రెస్ నేత తనపై ఒత్తిడిని తెచ్చారని, ఆయన బండారాన్ని పార్లమెంటు వేదికగా బట్టబయలు చేస్తానని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సుష్మా తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఈ ఉదయం 8:02 గంటలకు ఆమె ట్వీట్ చేయగా, ఆ వెంటనే సదరు నేత పేరు చెప్పాలని కామెంట్లు వచ్చాయి. దీన్ని పార్లమెంటులోనే ప్రస్తావిస్తానని సుష్మా సమాధానం ఇచ్చారు. కాగా, 2008-09 మధ్య కాలంలో సంతోష్ బర్గోడియా కేంద్ర బొగ్గు శాఖ సహాయమంత్రిగా విధులు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.