: అమరావతి నిర్మాణానికి రూ.3 లక్షల కోట్ల వ్యయం...మోడల్ ను రూపొందించిన తెలుగోడు!


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.3 లక్షల కోట్ల వ్యయం అవుతుందట. ఈ మేరకు తెలుగు నేలకు చెందిన మేనేజ్ మెంట్ కన్సల్టెంట్ ఎంఎన్ఆర్ గుప్తా ఓ మోడల్ ప్రాజెక్టును రూపొందించారు. నిర్మాణ రంగంలో పేరెన్నికగన్న 50 మంది అంతర్జాతీయ నిపుణులతో కలిసి ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశానని ఆయన నిన్న పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రకటించారు. సదరు మోడల్ ప్రాజెక్టును ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి కూడా అందజేశానని ఆయన చెప్పారు. అమరావతికి సంబంధించి సింగపూర్ ప్రతినిధి బృందం కేవలం మ్యాపును మాత్రమే అందించిందని, తాము మాత్రం ఎక్కడెక్కడ ఏఏ నిర్మాణాలు చేపట్టాలన్న సమగ్ర వివరాలతో మోడల్ ప్రాజెక్టును రూపొందించామని ఆయన చెప్పారు. గడచిన 12 ఏళ్లుగా ఓమన్ లో ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీ కంపెనీలో ఆయన మేనేజ్ మెంట్ ఎక్స్ పర్ట్ గా పనిచేస్తున్నారు.

  • Loading...

More Telugu News