: సివిల్స్ టాపర్ మార్కులెన్నో తెలుసా?
సివిల్స్ టాపర్ ఇరా సింఘాల్ సాధించిన మార్కులెన్నో తెలుసా... 1082 మార్కులు! అంటే 53.43 శాతంతో ఆమె 2014 సివిల్స్ టాపర్ గా నిలిచారు. ఈ మార్కులు చూస్తేనే సివిల్స్ ఎంత కష్టమైన పరీక్షో తెలుస్తుంది. సివిల్ సర్వీసెస్ లో నెగ్గుకు రావాలంటే, మొదట ప్రిలిమ్స్ లో విజయం సాధించిన తర్వాత మెయిన్స్, ఇంటర్వ్యూలకు హాజరు కావలసి వుంటుంది. ఒక అభ్యర్థి మెయిన్స్, ఇంటర్వ్యూ రెండింటిలో సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు. మిగిలిన పరీక్షల్లా కాకుండా సివిల్స్ లో కచ్చితత్వానికే మార్కులిస్తారు. తాజాగా సివిల్ సర్వీసెస్ కి ఎంపికైన అభ్యర్థుల మార్కుల షీట్లను ఆన్ లైన్లో పెట్టారు. మొత్తం 2025 మార్కులకు (మెయిన్స్ 1750 మార్కులు, ఇంటర్వ్యూ 275 మార్కులకు ఉంటుంది) గాను ఇరా సింఘాల్ 1082 మార్కులు సాధించగా, అలాగే రెండు, మూడు ర్యాంకులు సాధించిన రేణూ రాజ్ 52.14, నిధి గుప్తా 50.61 శాతం మార్కులు సాధించారు.