: ఇకపై రైలు భోజనానికి భయపడక్కర్లేదు...అందుబాటులో కేఎఫ్ సీ!


రైలులో భోజనంపై ఇకపై ఆందోళనలు వ్యక్తం కావేమో... భారతీయ రైల్వే ఆధునిక సౌకర్యాలను అందిపుచ్చుకుంటోంది. ఐఆర్సీటీసీ భోజనం నాసిరకంగా ఉంటోందంటూ చాలా కాలంగా ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలకు సమాధానంగా ఐఆర్సీటీసీ అంతర్జాతీయ సంస్థ కేఎఫ్సీ (కెంటకీ ఫ్రైడ్ చికెన్) తో ఒప్పందం చేసుకుంది. దీంతో ఇకపై రైళ్లలో కేఎఫ్సీ భోజనం లభించనుంది. ఈ-క్యాటరింగ్ సౌకర్యం ద్వారా కేఎఫ్సీ భోజనం ఆర్డర్ చేసుకోవచ్చని ఐఆర్సీటీసీ తెలిపింది. ప్రస్తుతం ఢిల్లీ మీదుగా వెళ్తున్న 12 రైళ్లలో ఈ సౌకర్యం అందజేయనున్నట్టు ఐఆర్సీటీసీ వెల్లడించింది. మరో పది రోజుల్లో హైదరాబాదు, విశాఖపట్టణం, బెంగళూరు రైల్వే స్టేషన్లలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్టు ఐఆర్సీటీసీ తెలిపింది. భోజనం బుక్ చేసుకునేందుకు ఐఆర్సీటీసీ అధికారిక వెబ్ సైట్, లేదా 18001034139 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చని ఐఆర్సీటీసీ తెలిపింది.

  • Loading...

More Telugu News