: పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారు: జగన్


వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా రైతు భరోసా యాత్రలో సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తారని విమర్శించారు. పుష్కరాల్లో సినిమా తీసేందుకు యత్నించి భక్తుల ప్రాణాలు బలిగొన్నారని మండిపడ్డారు. రైతు రుణమాఫీపై తాము సీఎంను అసెంబ్లీలో నిలదీస్తే, రైతులు ఇప్పుడు హాయిగా ఉన్నారని చెప్పారని దుయ్యబట్టారు. కానీ, చంద్రబాబు కనిపిస్తే రైతులు రాళ్లతో కొట్టే పరిస్థితి నెలకొందని అన్నారు. రుణాలు రెన్యూవల్ కాక, నష్టపోయిన పంటలకు బీమా చేతికి రాక రాష్ట్రంలో రైతులు చాలా అవస్థలు పడుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పిన అబద్ధాల కారణంగానే రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News