: పార్లమెంటులో రేపు 'ప్రైవేటు బిల్లు' ప్రవేశపెట్టనున్న టీడీపీ
పార్టీ ఫిరాయింపు నిరోధకచట్టానికి సవరణలు కోరుతూ రేపు పార్లమెంట్ లో ప్రైవేట్ మెంబర్ బిల్లును టీడీపీ ప్రవేశపెట్టనుంది. పార్టీ ఫిరాయింపుదారులపై 3 నెలల్లోనే స్పీకర్ వేటు వేయాలని, వేటు పడిన ఎమ్మెల్యేలు ఆరేళ్లపాటు ఎన్నికల్లో పాల్గొనకుండా చట్టసవరణ చేయాలని కోరుతూ టీడీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టబోతోంది. రాష్ట్ర విభజన తరువాత తెలుగు రాష్ట్రాల్లో పలువురు నేతలు పార్టీలు మారారు. ముఖ్యంగా తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి భారీ సంఖ్యలో నేతలు వచ్చి చేరారు. ఒక పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచి అధికార పార్టీలో మంత్రులుగా పదవులు కూడా అనుభవిస్తున్న వారు ఉన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ సవరణలు కోరనుంది.