: నిన్న పిల్లిని పెళ్లాడింది...నేడు కుక్కను పెళ్లాడతానంటోంది


పెంపుడు జంతువులపై అంతులేని మమకారం పెంచుకోవడం సర్వసాధారణం. అయితే పెంపుడు జంతువులను పెళ్లాడాలనేంత ప్రేమను పెంచుకోవడం కాస్త చిత్రమే. నెదర్లాండ్స్ కి చెందిన డొమెనిక్ అనే మహిళ చిత్రంగా పెంపుడు పిల్లితో ప్రేమలో పడింది. దీంతో తన పిల్లి డొరేక్ ని వివాహం చేసుకుంది. అనంతరం అది మరణించింది. దీంతో డొమినిక్ విషాదంలో కూరుకుపోయింది. ఈ విషాదం నుంచి కోలుకునేందుకు పెంపుడు కుక్క ట్రావిన్ ను పెళ్లాడాలనుకుంటోంది. అయితే ఇది జంతు సంరక్షణ కోసం ఓ ప్రయత్నం అని చెబుతోంది. తనలాగే ఎవరైనా పెంపుడు జంతువులతో వివాహం చేసుకోవచ్చని, ఆసక్తి ఉంటే తానే విర్చువల్ వివాహం చేయిస్తానని మాటిస్తోంది. ఇందుకోసం ఓ వెబ్ సైట్ ను కూడా నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపింది. ఈ వివాహాలు పెంపుడు జంతువులతో చేయించినా, కృూర జంతువులతో మాత్రం కాదని స్పష్టం చేస్తోంది.

  • Loading...

More Telugu News