: 'తెలంగాణ భవన్'ను ఈరోజు నుంచి 'తెలంగాణ సదన్' అని పిలుస్తాం: టీఆర్ఎస్ ఎంపీలు


ఈ రోజు నుంచి తెలంగాణ భవన్ ను తెలంగాణ సదన్ అని పిలుస్తామని టీఆర్ఎస్ ఎంపీలు ప్రకటించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో ఎంపీలు బాల్క సుమన్, విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, బీబీ పాటిల్, ప్రత్యేక ప్రతినిధి రామచంద్ర తేజావత్ లు పాల్గొని బోనమెత్తుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఉత్సవాలను నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఎంపీలు తెలిపారు. తెలంగాణకే సొంతమైన బోనాల ఉత్సవాలను రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను దేశానికి పరిచయం చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News