: పుష్కరాలకు వెళ్లేందుకు అనుమతివ్వండన్న సండ్ర... విచారణ ఎల్లుండికి వాయిదా
ఓటుకు నోటు కేసులో అరెస్టై బెయిలుపై వున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కొద్దిసేపటి క్రితం ఏసీబీ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. పవిత్ర గోదావరి పుష్కరాల్లో పుణ్య స్నానమాచరించేందుకు తనకు అనుమతివ్వాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం కోర్టుకు వచ్చిన ఆయన పిటీషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు ఈ పిటీషన్ ను పరిశీలనకు తీసుకుంటూనే, విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.