: ఏసీబీ కోర్టుకు సండ్ర వెంకట వీరయ్య... ఏసీబీ విచారణకు ‘తెలుగు యువత’ నేతలు


ఓటుకు నోటు కేసులో అరెస్టయి ప్రస్తుతం షరతులతో కూడిన బెయిలుపై వున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కొద్దిసేపటి క్రితం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. పుష్కర స్నానం ఆచరించడానికి తనను అనుమతించవలసిందిగా ఆయన పిటిషన్ వేశారు. ఇదిలా ఉంటే, ఈ కేసులో నిన్న ఏసీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరైన టీడీపీ యువజన విభాగం తెలుగు యువత నేతలు ప్రదీప్ చౌదరి, సుధీర్, పుల్లారావు, మనోజ్, రేవంత్ రెడ్డి కారు డ్రైవర్ రాఘవేందర్ రెడ్డిలు నేడు కూడా విచారణకు హాజరయ్యారు. నిన్న విచారణ పూర్తైన తర్వాత రేపు కూడా విచారణకు రావాలని వారికి ఏసీబీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కొద్దిసేపటి క్రితం వారంతా బంజారాహిల్స్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.

  • Loading...

More Telugu News