: ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్ సంగతేంటని అడిగా: తోట


ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన అఖిల పక్షం సమావేశానికి టీడీపీ తరపున ఎంపీ తోట నరసింహం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రానికి విజ్ఞప్తులు చేసినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పునర్విభజన బిల్లులో పేర్కొన్న విధంగా విశాఖపట్టణానికి రైల్వే జోన్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షన్ 8 అమలు, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు నిధులపై లోక్ సభలో మాట్లాడేందుకు ప్రధానిని అనుమతి కోరినట్టు ఆయన తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులకు టీడీపీ మద్దతిస్తుందని ఆయన బీజేపీ పెద్దలకు తెలిపారు.

  • Loading...

More Telugu News