: మేకపిల్లలను పొట్టన పెట్టుకుంటున్న కొండచిలువను బంధించిన గ్రామస్తులు


ఒక్క నెలలోనే 12 మేకపిల్లలను పొట్టన పెట్టుకున్న 14 అడుగుల కొండచిలువను స్థానికులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన, విజయనగరం జిల్లా నందగ్రామంలో జరిగింది. తన మందలోని మేకపిల్లలు ఉన్నట్టుండి మాయమవుతుండటం ఓ మేకల కాపరి గుర్తించాడు. ఇదే విషయాన్ని ఊరిలోని వారికి చెప్పాడు. దీంతో, చీకటి పడిన తర్వాత అంతా కాపుకాసి, మేకల మందలోకి కొండచిలువ రావడాన్ని గమనించారు. ఆ తర్వాత దాన్ని ఓ పథకం ప్రకారం బంధించారు. ఈ భారీ కొండచిలువను చూసేందుకు జనం ఎగబడుతున్నారు.

  • Loading...

More Telugu News