: తల్లిని కావాలనుంది...కానీ రెండు మూడేళ్లు ఆగాలి: కరీనా కపూర్


'మాతృత్వంలోని మధురిమల్ని ఆస్వాదించాలని వుంది. కానీ అందుకు మరో రెండు లేక మూడేళ్లు ఆగాల్సి వస్తోంది' అంటూ ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ నిట్టూరుస్తోంది. 'భజరంగీ భాయ్ జాన్' విజయవంతమైన ఆనందంలో ఉన్న కరీనా మాట్లాడుతూ, ప్రస్తుతానికి మంచి సినిమాల్లో నటించడంపైనే దృష్టి పెట్టానని చెప్పింది. మాతృత్వం గురించిన ఆలోచనే రానివ్వడం లేదని తెలిపింది. వివాహానంతరం కమర్షియల్ సినిమాలకు దూరమవ్వకుండా, వినోదాత్మక సినిమాల్లో నటిస్తున్నానని కరీనా వెల్లడించింది. అయితే రెంటినీ సమన్వయం చేసుకోవడం కాస్త కష్టంగా ఉందని తెలిపింది. భావితరాల నాయికలకు ఆదర్శంగా నిలవాలని అనుకుంటున్నానని కరీనా చెప్పింది. అందుకే కష్టమైనా వాణిజ్య, ఆఫ్ బీట్ సినిమాలను సమన్వయం చేసుకుంటున్నానని కరీనా వెల్లడించింది.

  • Loading...

More Telugu News