: కోటి కంటే ఎక్కువ జీతం అందుకుంటున్న ఉద్యోగుల్లో ఇన్ఫోసిన్ ను అధిగమించిన హెచ్ యూఎల్
ఏడాదికి రూ. కోటికి పైగా జీతం అందుకుంటున్న ఉద్యోగులు అధికంగా గల సంస్థగా ఇప్పటిదాకా ఇన్ఫోసిస్ కు గుర్తింపు ఉండేది. ఇప్పుడు ఇన్ఫీని హిందుస్థాన్ యూని లీవర్ (హెచ్ యూఎల్) అధిగమించింది. 2014-15 వార్షిక నివేదిక ప్రకారం హెచ్ యూఎల్ లో 170 మంది ఉద్యోగులు కోటి రూపాయల కంటే ఎక్కువ వేతనం అందుకుంటున్నారు. ఇదే సమయంలో, ఇన్ఫోసిస్ లో ఆ స్థాయి ఉద్యోగులు 113 మందే ఉన్నారు. హెచ్ యూఎల్ సీఈవో కమ్ ఎండీ సంజీవ్ మెహతా జీతం రూ. 14 కోట్లకు పైగా ఉంది. ఇందులో స్టాక్ ఆప్షన్లు, పెర్క్ లు కూడా కలసి ఉన్నాయి.