: ఇంటర్నెట్ మయంగా మారనున్న ఇండియా... రెండేళ్లలో 50 కోట్ల మందికి చేరువ!


2017 నాటికి ఇండియాలో అరచేతిలో ఇంటర్నెట్ ను అందుబాటులో ఉంచుకునే వారి సంఖ్య 50 కోట్లకు చేరనుంది. ఐఏఎమ్ఏఐ, కేపీఎమ్జీ సంయుక్తంగా 'మొబైల్ ఇంటర్నెట్ విజన్ ఇన్ ఇండియా' పేరిట రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. భారత్ ఇంటర్నెట్ మయం కానుందని అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశంలో వైర్ లైన్, వైర్ లెస్ మాధ్యమంగా నెట్ ను వాడుతున్న వారి సంఖ్య రూ. 35 కోట్లుగా ఉందని, రెండేళ్లలో మరో 15 కోట్ల మందికి పైగా నెట్ వాడటాన్ని ప్రారంభిస్తారని అంచనా వేసింది. మరో రెండేళ్ల తరువాత మొబైల్ మాధ్యమంగా ఇంటర్నెట్ ను వాడేవారి సంఖ్య 31.4 కోట్లకు చేరుతుందని తెలిపింది.

  • Loading...

More Telugu News