: మోదీని హిట్లర్ తో పోల్చిన ముంబయి మేయర్
శివసేన నేత, ముంబయి నగర మేయర్ స్నేహాల్ అంబేకర్ ప్రధాని నరేంద్ర మోదీని జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ తో పోల్చారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ... మోదీ స్వయంశక్తితో పనిచేస్తారని, ఆ విధంగా ఆయనను ఎంతో అభిమానిస్తానని, అయితే, పాలన పరంగా హిట్లర్ ను తలపిస్తారని వ్యాఖ్యానించారు. అధికారాలన్నీ ఒక వ్యక్తి గుప్పిట్లోనే కేంద్రీకృతమైనప్పుడు ఇలాంటి పాలనే కనిపిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలోనూ, కేంద్రంలోనూ శివసేన, బీజేపీ మిత్ర పక్షాలుగానే కొనసాగుతున్నా, కొంతకాలంగా ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా, శివసేన పలు అంశాల్లో బీజేపీపై సునిశిత విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో ముంబయి మేయర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.