: ట్విట్టర్ 'టైమ్ లైన్స్' మాయం... సేవల్లో అంతరాయం


ప్రముఖ సామాజిక మాధ్యమ సేవల వెబ్ సైట్ ట్విట్టర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ట్విట్టర్ యూజర్ల 'టైమ్ లైన్స్' ఖాళీగా కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం మొత్తం ట్విట్టర్ వెబ్ సైట్ పూర్తిగా ఆగిపోయింది కూడా. ఆ తరువాత స్పందించిన ట్విట్టర్ సిబ్బంది సమస్యను పరిష్కరించి వెబ్ సైటును పునరుద్ధరించినప్పటికీ, ఈ వార్త రాస్తున్న సమయానికి కూడా ఎంతో మంది యూజర్లు టైమ్ లైన్స్ లేకుండానే తమ తమ ట్వీట్లను పోస్ట్ చేస్తున్నారు. టైమ్ లైన్స్ సమస్యను కూడా త్వరగా పరిష్కరిస్తామని ట్విట్టర్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News