: డీఎస్ ఇంటికి కేసీఆర్.... నేటి సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక భేటీ


టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటీవల గులాబీ కండువా కప్పుకున్న సీనియర్ రాజకీయవేత్త ధర్మపురి శ్రీనివాస్ ఇంటికి వెళ్లనున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి పీసీసీ చీఫ్ గా వ్యవహరించడమే కాక మంత్రిగానూ డీఎస్ ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. 2004, 2009 ఎన్నికల్లో వైఎస్, డీఎస్ లది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లోనే కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలను నమోదు చేసింది. తాజాగా డీఎస్ కాంగ్రెస్ కు చేయిచ్చి కారెక్కారు. ఇక గులాబీ పార్టీలోనూ ఆయన కీలక భూమిక పోషించనున్నట్లు తెలుస్తోంది. నేటి సాయంత్రం జరగనున్న కేసీఆర్, డీఎస్ ల భేటీలో ఈ అంశమే ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలున్నాయని సమాచారం.

  • Loading...

More Telugu News